అందుకే కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు: నటుడు సాయాజీ షిండే
- మంచి నటుడు అనిపించుకోవాలనుకున్నాను
- అందుకోసం 10 సంవత్సరాల పాటు కష్టపడ్డాను
- ఎప్పుడూ వెనక్కి వెళ్లిపోదామనిపించలేదు
అలాంటి సాయాజీ షిండే తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు. " నేను త్వరగా ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనో .. బాగా డబ్బు సంపాదించాలనే ఆశతోనో ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు. మంచి నటుడు అనిపించుకోవాలనే ఆలోచనతో మాత్రమే వచ్చాను. అందువలన 10 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా .. విసుగు అనిపించలేదు .. వెనక్కి వెళ్లిపోదామని అనిపించలేదు" అంటూ చెప్పుకొచ్చారు.