'శ్రీనివాస కల్యాణం' మూవీకి ముహూర్తం ఖరారు
- దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
- మార్చి 3వ తేదీన ప్రారంభం
- 23 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మార్చి 3వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అదే నెల 23వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా కోసం కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేతలను ఎంపిక చేసుకున్నారు.