షూటింగులో రవితేజకి ఎలాంటి ప్రమాదం జరగలేదు: దర్శకుడు కల్యాణ్ కృష్ణ
- షూటింగు దశలో 'నేల టికెట్ '
- రవితేజ గాయపడినట్టు ప్రచారం
- అందులో నిజంలేదన్న కల్యాణ్
ఈ నేపథ్యంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ ..ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. షూటింగు సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదనీ .. ఎప్పటిలానే షూటింగులో రవితేజ చురుకుగా పాల్గొంటున్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయనున్నట్టు సమాచారం.