రజనీ కోసం కార్తీక్ సుబ్బరాజ్ రెడీ చేసిన కథపైనే అందరి చూపు!
- కళానిధి మారన్ నిర్మాణంలో రజనీ మూవీ
- దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్
- కొత్తదనం .. కథా కథనాలే ప్రధాన బలం
ఎంతోమంది సీనియర్ దర్శకులు రజనీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుండగా, ఆయన కార్తీక్ సుబ్బరాజ్ ప్రాజెక్టును ఓకే చేయడంతో, ఆ కథ ప్రత్యేకత ఏమై ఉంటుందా అనే ఆసక్తి తలెత్తుతోంది. 'కబాలి' .. 'కాలా' మాదిరిగా ఈ సినిమాలో మరీ స్టైలీష్ గా రజనీకాంత్ కనిపించడనేది తాజా సమాచారం. కథా కథనాలు కొత్తగా .. బలంగా వుంటాయని మాత్రం తెలుస్తోంది. ఈ కారణంగానే రజనీ ఈ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందనీ .. ఈ ఏడాది చివరినాటికి షూటింగును పూర్తి చేసుకుంటుందని చెబుతున్నారు.