రజనీతో సన్ పిక్చర్స్ భారీ చిత్రం .. తాజా ప్రకటన
- రజనీ హీరోగా సన్ పిక్చర్స్ వారి సినిమా
- దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్
- త్వరలో సెట్స్ పైకి
రజనీ హీరోగా .. కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా ఫేం) దర్శకత్వంలో తమ తదుపరి సినిమా ఉంటుందని, తాజాగా సన్ పిక్చర్స్ వారు ఒక ప్రకటన చేశారు. సన్ పిక్చర్స్ వారి సినిమా అంటే అది ఎంతటి భారీస్థాయిలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కొన్ని సినిమాలు మాత్రమే చేసినా .. వాటిలో వైవిధ్యం కారణంగా, కార్తీక్ సుబ్బరాజ్ లోని ప్రతిభ కారణంగా ఈ ఛాన్స్ ఆయనకి దక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి.