అప్పుడు మా నాన్న నన్ను కొట్టేశారు .. ఆ తరువాత బాధపడ్డారు!: వరుణ్ తేజ్
- ఓ రాత్రివేళ నేను నా ఫ్రెండ్స్ తో ఉండిపోయాను
- నేను కనిపించకపోవడంతో నాన్న కంగారుపడిపోయారు
- నన్ను వెతుక్కుంటూ నేనున్న చోటుకు వచ్చారు
"ఇంటికివచ్చాక జరిగిన సంఘటన గురించి మా అమ్మకి బాధతో చెప్పాను. నేను వెళ్లి చాలాసేపు కావడంతో మా నాన్న కంగారు పడిపోయారట. ఆ సమయంలో నా మొబైల్ కూడా పనిచేయలేదు. దాంతో 3 గంటలుగా నా కోసం మా నాన్న వెతుకుతూనే వున్నారట. అందువల్లనే ఆయనకి అంతగా కోపం వచ్చిందని అమ్మ చెప్పింది. ఇంకెప్పుడూ చేయిచేసుకోనంటూ మా నాన్న బాధపడటం కూడా నాకు బాగా గుర్తుంది" అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.