ఆకట్టుకుంటోన్న 'లక్ష్మి' టీజర్ .. ప్రభుదేవా ఫ్యాన్స్ కి పండగే!
- డాన్స్ ప్రధాన ఇతివృత్తంగా సినిమా
- ప్రధానమైన పాత్రలో ప్రభుదేవా
- దర్శకుడిగా ఎ.ఎల్. విజయ్
ప్రభుదేవా కీలకపాత్రగా 'అభినేత్రి' సినిమా చేసిన ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. డాన్స్ ప్రధాన ఇతివృత్తం కనుక .. డాన్స్ కి సంబంధించిన దృశ్యాలపైనే ఈ టీజర్ ను కట్ చేశారు. పూర్తిస్థాయిలో ప్రభుదేవా డాన్స్ చూడాలనుకునే అభిమానుల ముందుకు ఈ సినిమా ఓ పండగలా వస్తుందనే చెప్పాలి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయనున్నారు.