సోనం కపూర్ సినిమాతోనే రెజీనా బాలీవుడ్ ఎంట్రీ
- టాలీవుడ్లో నటించిన చిత్రాలకు మంచి గుర్తింపు
- 'ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ
- షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
ఈ సినిమాను షెల్లీ చోప్రా ధర్ డైరెక్టు చేస్తున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావ్, అనిల్ కపూర్, జూహీ చావ్లా తదితర సీనియర్ నటులు నటిస్తున్నారు. తమ సినిమాలో ఓ దక్షిణాది భామ ఉంటే బావుంటుందని ఈ చిత్ర దర్శకనిర్మాతలు భావించారట. అలా దక్షిణాదిన తమకు నచ్చిన భామ కోసం అన్వేషిస్తుంటే వారి నజర్ రెజీనాపై ఆగిందని... అలా ఈ సినిమా చాన్స్ ఆమెను వరించిందని సమాచారం. తెలుగులో సుబ్రమణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.