వేరే దేశాల్లో అయితే రామ్ గోపాల్ వర్మను షూట్ చేసి పారేస్తారు: ఐద్వా మహిళ మణి
- రెండు రాష్ట్రాల మహిళల ఆత్మగౌరవాన్ని వర్మ కించపరిచారు
- దుర్మార్గంగా మాట్లాడుతున్న వర్మను ఎలా వదిలేస్తాం?
- ఎవడండీ ఈ రామ్ గోపాల్ వర్మ? వైజాగ్ రమ్మనమనండి సంగతి చెబుతాం!
- చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? : మణి మండిపాటు
రెండు రాష్ట్రాల మహిళల ఆత్మగౌరవాన్ని రామ్ గోపాల్ వర్మ కించపరిచారు. ఆ పోర్న్ సినిమాకు మార్కెటింగ్ కోసం అందరినీ ఉపయోగించుకున్నారు. యువతను పక్కదారి పట్టించారు. ఆ సినిమాకు లాభాలు దండుకున్నాడు. ఈ చిత్రం పర్యవసానం అనుభవించేది ఎవరు? రాష్ట్రంలో ఉన్న మహిళలు, పిల్లలు. ఈ సమస్య పెద్ద సమస్య కాదా? అని మేడమ్ గారిని (నన్నపనేని రాజకుమారి) ప్రశ్నిస్తున్నాను.
ఎంతో దుర్మార్గంగా మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మను ఎలా వదిలేస్తాం? క్షమాపణలు చెప్పాను కనుక, ఊరుకోండి అని అంటున్నాడు. ఎవడండీ, ఈ రామ్ గోపాల్ వర్మ? వైజాగ్ రమ్మనమనండి సంగతి చెబుతాం! చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? అసలు, భారతదేశంలో ఉన్నామా? వేరే దేశాల్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. వేరే దేశాల్లో అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి వాడిని షూట్ చేసి పారేస్తారు! మన దేశంలో కాబట్టి, సహనం ఎక్కువైపోయి, చట్టాలు ఎక్కువైపోయి, అందులో లూప్ హోల్స్ ఎక్కువైపోయి అయ్యగారు (వర్మ) లాంటి వాళ్లు ఊరు మీద తిరుగుతున్నారు’ అంటూ మణి మండిపడ్డారు.