పెద్ద బ్యానర్లో గోపీచంద్ హీరోగా సినిమా?
- 'తొలిప్రేమ' సక్సెస్ తో బీవీఎస్ ఎన్ ప్రసాద్
- గోపీచంద్ తో సినిమా అంటూ టాక్
- దర్శకుడిగా వీరు పోట్ల పేరు
గోపీచంద్ హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నా .. గోపీచంద్ హిట్ కొట్టి చాలాకాలమే అయింది. ఇక ఈ మధ్య వీరు పోట్ల దర్శకత్వం వహించిన 'ఈడు గోల్డ్ ఎహే' పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ కాంబినేషన్లో సినిమా చేయనున్నాడనే వార్త, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.