పారితోషికం విషయంలో దిగిరాని కాజల్!
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
- మరో కథానాయిక కోసం కాజల్ తో సంప్రదింపులు
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా కాజల్ ను సంప్రదించారు. అయితే ఈ సినిమా కోసం ఆమె అడిగిన పారితోషికం .. సాధారణంగా తీసుకునే దానికంటే ఎక్కువేనట. ఆమెకి ఇవ్వాలనుకున్న పాత్ర ముఖ్యమైనదే అయినా నిడివి కాస్త తక్కువగా వుంటుందట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మెట్టుదిగమని అడుగుతున్నారు. ఈ విషయం కారణంగానే ఆలస్యం జరుగుతోందనీ .. ఆమె చేసేది లేనిది త్వరలో తేలిపోతుందని అంటున్నారు.