తేజు సినిమాలో అనుపమ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువట!
- కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్
- అనుపమ పాత్ర చుట్టూ తిరిగే కథ
- కంటెంట్ పై నమ్మకంతో తేజు
'ఫిదా' సినిమాలో సాయిపల్లవి వైపు నుంచి కథ కొనసాగుతుంది. అలాగే ఈ సినిమాలో అనుపమ కోణంలో కథ నడుస్తూ వుంటుందట. ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుందని ముందుగా సాయిధరమ్ తేజ్ కి కరుణాకరన్ చెప్పాడట. అయితే కొత్తదనంతో కూడిన కథ కావడం వలన, వైవిధ్యం కోసం ఈ సినిమా చేయడానికి తేజు అంగీకరించాడని అంటున్నారు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న తేజుకి, ఈ సినిమా అయినా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.