'హిరణ్యకశిప' కోసం రానాతో సెట్స్ పైకి గుణశేఖర్
- గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'
- 150 కోట్ల బడ్జెట్ తో రంగంలోకి
- ప్రధానపాత్రలో రానా
టైటిల్ రోల్ ను రానా చేయనున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. దీనిని సురేశ్ ప్రొడక్షన్స్ .. గుణ టీమ్ వర్క్స్ పై సంయుక్తంగా నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారట.