గేమ్ షో: నటుడు ఆర్యను పెళ్లాడేందుకు అమ్మాయిల క్యూ.. 70 వేల దరఖాస్తులు!
- ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ షో కోసం దరఖాస్తుల ఆహ్వానం
- వెల్లువెత్తిన దరఖాస్తులు
- వడపోసి 18 మందిని ఫైనల్ చేసిన టీవీ చానల్
వయాకామ్ 18 అనే సంస్థ ఇటీవల కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చానల్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఏప్రిల్‌లో ‘ఇంగవీట్లు మాపిళ్ళై' అనే స్వయంవరం కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. ఈ షోలో నటుడు ఆర్య పెళ్లికొడుకుగా పాల్గొనేందుకు సమ్మతించాడని పేర్కొన్నారు. కాగా, ఈ షోలో భాగంగానే అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లోంచి 18 మందిని ఎంపిక చేసి పైనల్ చేశారు.