త్రివిక్రమ్ మూవీకి అనిరుథ్ కి బదులుగా తమన్!
- త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ
- ముందుగా వినిపించిన అనిరుథ్ పేరు
- కొత్తగా తెరపైకి తమన్ పేరు
కానీ ఆయన స్థానంలో తమన్ ను తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడనే వారు లేకపోలేదు. 'అ ఆ' సినిమాకి మిక్కీ జె.మేయర్ తో బాణీలు చేయించుకున్న త్రివిక్రమ్ .. 'అజ్ఞాతవాసి'కి అనిరుథ్ కి అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిని మార్చవచ్చనీ, తమన్ కి ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది త్వరలోనే తెలియనుంది.