తమిళనాడులో నా పర్యటనను ప్రారంభిస్తున్నట్టు రజనీకి చెప్పా :కమల హాసన్
- రజనీకాంత్ నివాసానికి వెళ్లిన కమలహాసన్
- నా పర్యటనకు ముందు అందరినీ ఓసారి కలవాలనుకున్నా
- అందుకే, రజనీని కలిశా.. ఆయన నా ప్రాణమిత్రుడు: కమల్
తన పర్యటనకు ముందు అందరినీ ఓసారి కలవాలని అనుకున్నానని, ఈ నేపథ్యంలోనే రజనీని కలిసినట్టు చెప్పారు. ఈ నెల 21న తన రాజకీయపార్టీని ప్రకటిస్తున్నానని, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదని స్పష్టం చేశారు. గతంలో కూడా చాలా మంది ప్రముఖులను తాను కలిశానని, రజనీకాంత్ తన ప్రాణమిత్రుడని, అందుకే, కలిశానని పేర్కొన్నారు.