షాక్ ఇస్తోన్న మోహన్ లాల్ ఫస్టులుక్
- మోహన్ లాల్ తాజా చిత్రంగా 'కాయకులం కొచ్చున్ని'
- ఓ దోపిడీ దొంగ జీవితచరిత్రయే కథగా
- ప్రధాన పాత్రల్లో నివిన్ పౌలి .. ప్రియా ఆనంద్
ఓ దోపిడీ దొంగ జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, హీరో నివిన్ పౌలి ట్విట్టర్ ద్వారా మోహన్ లాల్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశాడు. 'ఇత్తిక్కారపక్కి' అనే అరవీరభయంకరుడి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. ఈ లుక్ ఆయనకి పర్ఫెక్ట్ గా సూతయ్యిందనీ .. తెరపై కొత్త మోహన్ లాల్ ను చూడబోతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మోహన్ లాల్ తో పాటు నివిన్ పౌలి .. ప్రియా ఆనంద్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్రకోసం, కేరళ సంప్రదాయ యుద్ధ విద్యలో మోహన్ లాల్ శిక్షణ తీసుకోవడం విశేషం.