నానితో హ్యాట్రిక్ మూవీ చేయనున్న దిల్ రాజు
- నానిని ఒప్పించిన విక్రమ్ కుమార్
- నానిని మెప్పించిన హను రాఘవపూడి
- ఈ రెండు సినిమాల్లో ఒకదానికి నిర్మాతగా దిల్ రాజు
ఈ సినిమా తరువాత నానితో మూడవ సినిమా చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. గతంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన 'నేను లోకల్' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలు విజయాలను సాధించాయి. అందువలన హ్యాట్రిక్ మూవీ చేయాలనే ప్రయత్నాలలో దిల్ రాజు వున్నట్టుగా తెలుస్తోంది. ఒక వైపున విక్రమ్ కుమార్ .. మరో వైపున హను రాఘవపూడి .. నాని కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో దిల్ రాజు ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.