భన్సాలీతో మరో మూడు చిత్రాల్లో రణ్‌వీర్-దీపిక?
- రణ్‌వీర్-దీపిక నటనకు ఫిదా అయిన దర్శకధీరుడు
- ఆయన దర్శకత్వంలో మూడు చిత్రాలు చేసిన ప్రేమజంట
- వారితో ఆరేళ్ల పాటు మరో మూడు చిత్రాలకు దర్శకుడి డీల్?
దీనికి సంబంధించి వారి మధ్య డీల్ కూడా కుదిరిందని బాలీవుడ్ ట్రేడ్ ఇన్‌సైడర్ ఒకరు చెప్పినట్లు 'ఆసియన్ ఏజ్' పత్రిక ఉటంకించింది. వారిద్దరి నటన మాత్రమే కాక ప్రొఫెషన్ పట్ల వారి అంకితభావానికి ఆయన ఫిదా అయిపోయారని, అందుకే వారితో మళ్లీ కలిసి పనిచేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. పద్మావత్ సినిమా షూటింగ్‌కు, ఆ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు వారు ఎంతో సహనంతో సహకరించడం భన్సాలీకెంతో నచ్చిందట. అందువల్ల వారిద్దరితో ఆరేళ్ల పాటు మూడు సినిమాలకు ఆయన డీల్ కుదుర్చుకున్నారట.