ఆ నిర్మాతే పెద్ద 420: సందీప్ కిషన్
- ఆ నిర్మాత చెప్పిందంతా అబద్ధం
- నేను చాలా ఆందోళన చెందాను
- నాకు తెలిసి ఆయన మాటలను ఎవరూ నమ్మరు
"తమిళ మూవీ 'మాయావన్' హక్కులను బషీద్ తీసుకునేంత వరకూ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన నేపథ్యం గురించి తెలుసుకుని, ఈ సినిమా విడుదలయ్యేనా? అనే ఆందోళనకి లోనయ్యాను. ఆయన ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది తక్కువ .. చెప్పుకున్నది ఎక్కువ. ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు .. ఎన్నో కేసులు వున్నాయి. నిజం చెప్పాలంటే ఆయన ఓ పెద్ద 420 .. అలాంటి ఆయన నా గురించి అబద్ధాలు చెబితే నమ్మేదెవరు?" అంటూ చెప్పుకొచ్చాడు.