రెండో తరగతిలోనే మనసుపారేసుకున్నా.. నాలుగేళ్ల క్రితం ప్రేమలో పడ్డా: తాప్సీ
- నాలుగేళ్ల క్రితం ప్రేమలో పడి, బ్రేకప్ అయ్యాం
- ఆ తర్వాత కెరీర్ పరంగా చాలా ఎదిగా
- ఇప్పుడు వ్యక్తిగత విషయాలను చెప్పాలనుకోవడం లేదు
నాలుగేళ్ల క్రితం ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డానని తాప్సి తెలిపింది. అయితే ఆ తర్వాత తామిద్దరం బ్రేకప్ అయ్యామని... అది కూడా తన మంచికే అనుకుంటానని చెప్పింది. లవ్ బ్రేకప్ కావడం కూడా ఒక్కోసారి మనకు ఎంతో ఉపకరిస్తుందని... ఈ నాలుగేళ్లలో కెరీర్ పరంగా తాను ఎంతో ఎదిగానని తెలిపింది. ఇప్పుడు తాను ప్రేమలో ఉన్నానా? లేదా? అనే విషయం గురించి అడిగితే చెప్పడం కష్టమని... వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పాలనుకోవడం లేదని చెప్పింది.