వెంకీకి 'ఛలో' హిట్ భారీ ఛాన్స్ తెచ్చిపెట్టేసింది!
- 'ఛలో' తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
- పెద్ద బ్యానర్ నుంచి పిలుపు
- స్టార్ హీరో .. హీరోయిన్స్ తో చేసే అవకాశం
దాంతో ఆయనతో ఓ సినిమా చేయడానికి హారిక అండ్ హాసిని బ్యానర్ వారు ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వెంకీ కుడుముల వినిపించిన లైన్ నచ్చడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో ఆయన వున్నాడని అంటున్నారు. స్టార్ హీరో .. హీరోయిన్స్ తో ఈ సినిమా వుండనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ బ్యానర్ వెంకీ కుడుముల ప్రాజెక్టుపై దృష్టి పెట్టనుంది.