పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రెడీ చేశాను .. 'పవన్' అనే టైటిల్ కూడా పెట్టేశాను: మహేశ్ సోదరి మంజుల
- మహేశ్ తరువాత పవన్ అంటే అభిమానం
- ఆయనలోని నిజాయతీ నచ్చుతుంది
- నేను రెడీ చేసిన కథ వినమని చెప్పండి
ఈ సమయంలోనే ఆమె పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు .. మహేశ్ తరువాత నేను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చుతుంది. ఆయన కోసం నేను ఒక కథ రాసుకున్నాను .. ఆ కథకి 'పవన్' అనే టైటిల్ ను కూడా పెట్టేశాను. నేను రాసిన కథ పవన్ వినాలే గానీ, ఆయనకి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. ఒకసారి ఈ కథ వినమని మీరైనా చెప్పండి" అంటూ ఆమె మీడియా మిత్రులను కోరడం విశేషం.