హెచ్చరించినట్టుగానే... అన్నంత పనీ చేసిన రేణుకా చౌదరి!
- రామాయణం సీరియల్ వీడియోను పోస్టు చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- శూర్పణఖ నవ్వుతున్న వీడియోను పెట్టి, రేణుకను ప్రస్తావించిన రిజిజు
- ఈ ఉదయం పార్లమెంట్ లో హక్కుల నోటీసులు ఇచ్చిన రేణుకా చౌదరి
దీనిపై తీవ్ర విమర్శలు రాగా, ఆయన తన పోస్టును తొలగించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా, ముందుగా హెచ్చరించినట్టుగానే రేణుక అన్నంతపనీ చేశారు. ఇది ఓ మహిళను అవమానించడమేనంటూ, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన రేణుక, ఈ ఉదయం రాజ్యసభలో హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రిజిజు వైఖరిపై చర్చించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.