అఫ్జల్ గురు ఉరికి నేటితో ఐదేళ్లు.. జమ్ముకశ్మీర్‌లో హై అలెర్ట్
- ఫిబ్రవరి 9న పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరి
- ప్రతీకారం కోసం రగిలిపోతున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ
- ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
- అప్రమత్తమైన పోలీసులు
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు భారత జైలులో ఉన్న మసూద్ అజర్‌ను విడిపించుకెళ్లారు. జైలు నుంచి బయటకొచ్చిన మసూద్ అజర్ ఆ వెంటనే 2000 సంవత్సరంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత 2014లో అఫ్జల్ గురుతో కలిసి అజర్ జమ్ముకశ్మీర్ ప్రచారం ప్రారంభించాడు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ‘అఫ్జల్ గురు స్క్వాడ్’ను సిద్ధం చేశాడు. నవంబరు 25, 2015లో కుప్వారాలో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో అఫ్జల్ గురును దోషిగా తేల్చిన న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఫిబ్రవరి 9న ఆయనను ఉరితీశారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడంతో ఉడికిపోతున్న జేషే మహమ్మద్ సంస్థ ప్రతి సంవత్సరం దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం లోయలో 22 మంది జైషే ఉగ్రవాదులు ఉండగా వారిలో 15 మంది దక్షిణ కశ్మీర్‌కు చెందిన వారే.