జాక్వెలిన్ తో మాధురీ దీక్షిత్ హిట్ సాంగు!
- మాధురీ "ఏక్..దో..తీన్.."పాటకు జాక్వెలైన్ స్టెప్పులు
- 30 ఏళ్ల తర్వాత భాగీ-2 సినిమాలో ఈ పాట రీమిక్స్
- ఈ సాంగ్‌కు జాక్వెలైనే కరెక్టన్న డైరెక్టర్ అహ్మద్
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఎవర్‌గ్రీన్ హిట్ "ఏక్..దో..తీన్.."పాటకు జాక్వెలైన్ డాన్స్ చేయనుంది. ఆ పాటకు అప్పట్లో అల్కా యాగ్నిక్‌కు ఉత్తమ గాయనిగాను, సరోజ్ ఖాన్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గారను అవార్డులు దక్కాయి. "చోలీ కే పీచే క్యా హై..." పాట నుండి సరోజ్‌కు సహాయకుడిగా పనిచేసిన అహ్మద్ ఖాన్ భాగీ-2 సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ "ఏక్..దో..తీన్.."పాటలో బ్యాక్ అప్ డాన్సర్లలో ఒకరైన గణేశ్ ఆచార్య ఈ రీమిక్స్ పాటకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ పాట కోసం మొత్తం ముగ్గురు కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నట్లు అహ్మద్ చెప్పాడు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పాడు. కాస్ట్యూమ్స్ బాధ్యతను మనీష్ మల్హోత్రాకి అప్పగించారు. గతంలో జాక్వెలైన్‌తో చేసిన పాటల వల్ల మాధురీ ప్లేస్‌లో తనే సరైన ఎంపిక అని అహ్మద్ అంటున్నాడు. మరి.. సినిమా రిలీజయ్యాక వెండితెరను జాక్వెలైన్ ఏ రేంజ్‌లో హీటెక్కిస్తుందో చూడాలి.