రామాయణంలో ఆ నవ్వు ఎవరిదబ్బా?... పార్లమెంటు లాబీల్లో ఎడతెగని చర్చ!
- నిన్న మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్న రేణుకా చౌదరి
- రామాయణంలోని ఓ పాత్ర నవ్వుతో పోల్చిన ప్రధాని
- ఆ పాత్ర ఏంటోనని ఆసక్తికర చర్చ!
ఆ సమయంలో చైర్ లో ఉన్న వెంకయ్యనాయుడు, ప్రధాని ప్రసంగాన్ని ఆపించి, మీకేమైంది? ఈ ప్రవర్తన సరికాదని హితవు పలకగా, "సభాపతి గారూ, రేణుకను అడ్డుకోకండి. రామాయణం సీరియల్ తరువాత అంతటి నవ్వును వినే భాగ్యం ఈ రోజే మనకు దక్కింది" అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇక రామాయణంలోని ఏ పాత్రతో రేణుకను ప్రధాని పోల్చారా? అని ఎంపీల మధ్య చర్చ ఆసక్తికరంగా జరుగుతోంది. వాస్తవానికి మహాభారతంలో ద్రౌపది నవ్వు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందన్న సామెతలను మనం వింటుంటాం. మరింక రామాయణంలో ఎవరు నవ్వారో, వారి నవ్వు ఫలితమేంటో ప్రధానే చెప్పాలేమో?!