నాలా చేసి చూపించు... విరాట్ కోహ్లీకి సవాల్ విసిరిన రవిశాస్త్రి!
- 'ప్యాడ్ మ్యాన్' సవాల్ స్వీకరించిన రవిశాస్త్రి
- చేతిలో శానిటరీ ప్యాడ్ పట్టుకుని ఫొటో దిగిన టీమిండియా కోచ్
- కోహ్లీ కూడా అదే పని చేసి చూపించాలని సవాల్
రాక్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రారంభించిన 'ప్యాడ్ మ్యాన్' ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని చెప్పాడు. తన సవాల్ కోహ్లీతో పాటు గౌతమ్ సింఘానియా, లియాండర్ పేస్ లకు కూడా వర్తిస్తుందని చెప్పాడు. ఈ విషయంపై అక్షయ్ కుమార్ బహిరంగ చర్చ లేపడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నాడు. తన చేతిలోని ప్యాడ్ ను చూపుతూ రవిశాస్త్రి పెట్టిన పోస్టుకు వేల కొలదీ లైక్స్ వస్తున్నాయి.