నరేంద్ర మోదీ ర్యాలీపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు!
- బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన మోదీ
- విమర్శలు గుప్పించిన ప్రకాశ్ రాజ్
- మోదీ మార్పులు తీసుకొస్తాడని భావిస్తున్నారా అంటూ సెటైర్లు
బెంగళూరులో జరిగిన ర్యాలీలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలను గుప్పించారు. కేంద్ర నిధులను మళ్లిస్తూ, అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, బెంగళూరు మెట్రోకు కేంద్ర బడ్జెట్లో రూ. 17,000 కోట్లను కేటాయించామని చెప్పారు. కర్ణాటక రూపు రేఖలను మార్చేది బీజేపీనే అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.