అల్లరి నరేశ్ జోడిగా 'రంగుల రాట్నం' హీరోయిన్
- అల్లరి నరేశ్ తో భీమనేని శ్రీనివాసరావు
- 'సుడిగాడు' హిట్ తరువాత చేస్తోన్న మూవీ
- ముఖ్యమైన పాత్రలో సునీల్
ఈ సినిమా కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించి, చివరికి 'చిత్రా శుక్లా'ను ఎంపిక చేశారట. రాజ్ తరుణ్ జోడీగా .. 'రంగులరాట్నం' సినిమాతో చిత్రా శుక్లా పరిచయమైంది. ఈ సినిమా పరాజయంపాలైనా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు దక్కాయి. యూత్ లో క్రేజ్ ను సంపాదించుకోవడం వలన ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ తో పాటు చాలామంది హాస్య నటీనటులు ఈ సినిమాలో నటించనున్నట్టుగా చెబుతున్నారు. శ్రీవసంత్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.