తేజ .. వెంకటేశ్ మూవీలో నారా రోహిత్!
- తేజ దర్శకత్వంలో వెంకటేశ్
- ఈ నెల 3వ వారంలో రెగ్యులర్ షూటింగ్
- త్వరలోనే పూర్తి వివరాలు
ఇక ఈ సినిమాలో కథను మలుపుతిప్పే ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను నారా రోహిత్ చేస్తే బాగుంటుందని భావించిన తేజ ఆయనను సంప్రదించాడట. కథ .. పాత్ర బాగుండటం , వెంకటేశ్ కాంబినేషన్ కావడంతో నారా రోహిత్ వెంటనే అంగీకరించాడని చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.