చిరూ మూవీ టైటిల్ తో 'బిచ్చగాడు' హీరో!
- ఈ నెల 7వ తేదీన సెట్స్ పైకి విజయ్ ఆంథోని
- తమిళంతో పాటు తెలుగులోను
- తెలుగు టైటిల్ గా 'రోషగాడు'
ఈ నెల 7వ తేదీన షూటింగ్ మొదలుకానున్న తన సినిమాకి ఆయన 'రోషగాడు' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆయన విడుదల చేశాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ అనే విషయం పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకి గణేశ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. విజయ్ ఆంటోని ఇంతకుముందు చేసిన సినిమాకి చిరంజీవి పాత్ర పేరైన 'ఇంద్రసేన' అనే టైటిల్ పెట్టాడు. ఇప్పుడేమో గతంలో చిరంజీవి చేసిన 'రోషగాడు' టైటిల్ ను ఫిక్స్ చేయడం గమనించదగిన విషయం.