నిహారికతో పెళ్లి వార్తలపై వివరణ ఇచ్చిన సినీ హీరో నాగశౌర్య!
- హీరోయిన్లతో లింకులు పెడుతున్నారు
- నాకు సిగ్గెక్కువ, కామ్ గా ఉంటాను
- ఆడవాళ్లతో మాట్లాడాలంటేనే సిగ్గు
‘కళ్యాణ వైభోగమే’ నాయిక మాళవికతో, ‘వూహలు గుసగుసలాడే’ నాయిక రాశీఖన్నాతో, ‘ఒకమనసు’ నాయిక నిహారికతో, ‘జాదూగాడు’ నాయిక సోనారికతో ప్రేమలో ఉన్నట్లు వదంతులు సృష్టించారని పేర్కొన్నాడు. ఇప్పుడు నిహారికతో పెళ్లని కథనాలు వండివారుస్తున్నారని, తొలుత వాటిని పట్టించుకోకపోయినా, ఎంతో కొంత చికాకు పుట్టిస్తాయని నాగశౌర్య పేర్కొన్నాడు.
కథనాలు పేర్కొంటున్నట్టుగా తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని అన్నాడు. తాను కామ్ గా ఉంటానని, ఆడవాళ్లతో మాట్లాడాలంటేనే సిగ్గని చెప్పాడు. మరో మూడు లేక నాలుగేళ్ల తరువాత తన తల్లి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నాగశౌర్య తెలిపాడు. తనది ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేమవివాహం కాదని స్పష్టం చేశాడు.