అమానుషం... 8 నెలల పాపను కూడా వదలని కీచకుడు
- ఢిల్లీలోని సుభాష్ నగర్ లో దారుణం
- పాపను ఆడిస్తానంటూ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసిన బావ
- పరారీలో ఉన్న యువకుడ్ని అరెస్టు చేసిన పోలీసులు
పాప ప్రాణాలు మాత్రం నిలపగలిగామని, కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేయగా, నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగికదాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఘాటుగా స్పందిస్తూ, ‘‘ఇప్పుడే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఎనిమిది నెలల పసిగుడ్డుపై ఇంత దారుణంగా అత్యాచారం జరిగితే ఢిల్లీ ఎలా నిద్రపోగలుగుతున్నది? మన సమాజం ఇంత మొద్దుబారిందా, ఇది ఆడపిల్లల తలరాత అనుకోవాలా! వాళ్లేరి? మహిళల గౌరవాన్ని కాపాడుతామంటూ స్కూల్ బస్సులపై దాడులు చేసిన సేనలు ఎక్కడ?’’ అంటూ సమాజాన్ని నిలదీశారు.