నాని 'అ!' సినిమా రిలీజ్ డేట్ ఖరారు
- నాని నిర్మాతగా 'అ!' మూవీ
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
- ఫిబ్రవరి 16న సినిమా విడుదల
అయితే ఈ సినిమా విడుదలను ఫిబ్రవరి 16వ తేదీకి ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన వెరైటీ పోస్టర్ ను వదిలారు. "అన్ని సినిమాలందు 'అ' సినిమా వేరయా .. విశ్వదాభి రామా ఫిబ్రవరి 16 రిలీజ్ రా మామా" అంటూ తాళపత్రాల రూపంలో కొత్తగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో, చేప పాత్రకు నాని .. చెట్టు పాత్రకు రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాతో నిర్మాతగానూ నాని సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.