అల్లరి నరేశ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు!
- భీమనేనితో ఓ మూవీ చేస్తున్న అల్లరి నరేశ్
- తాజాగా గిరి అనే దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే సెట్స్ పైకి
గతంలో 'నందిని నర్సింగ్ హోమ్' చేసిన దర్శకుడు 'గిరి' .. ఇటీవల అల్లరి నరేశ్ కి ఒక కథ వినిపించాడట. ఆ కథ కొత్తగా అనిపించడంతో .. చేయడానికి వెంటనే అల్లరి నరేశ్ అంగీకరించాడని అంటున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.