ముస్లింలకు వ్యతిరేకమే అయితే ట్రిపుల్ తలాక్ బిల్లును ఎందుకు తీసుకొస్తాం?: సురేశ్ ప్రభు
- మతం ఆధారంగా వివక్ష ఉండదు
- అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి
- అందరూ సమానంగా హక్కులను అనుభవించాలి
‘‘మేం ముస్లింలకు వ్యతిరేకమే అయితే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చేవాళ్లమే కాదు. ముస్లింల జనాభా 14 శాతం అయితే ఇందులో సగం మంది మహిళలే. ఈ వర్గానికి వ్యతిరేకం అయితే మహిళల హక్కులను కాపాడేందుకు బిల్లులను ఎందుకు తీసుకొస్తాం?’’ అని సురేశ్ ప్రభు అన్నారు.