అప్పుడుగానీ తెలియలేదు...అప్పటికి కృష్ణవంశీ భోజనం చేసి రెండు రోజులైందని!: బ్రహ్మాజీ
- 'నిన్నేపెళ్లాడుతా' సమయంలో మంచి స్నేహితులమయ్యాం
- కృష్ణవంశీ పస్తులుంటాడు కానీ ఎవరినీ చేయి చాచి అడగడు
- ఒక్కపూట భోజనానికి కృతజ్ఞతగా సినిమాల్లో అవకాశం ఇచ్చాడు
"ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటే సమయం తెలియలేదు. రాత్రి 8.30 అవుతోంది, ఆకలేస్తోంది. మెస్ లో కార్డు ఉండడంతో ‘వంశీ రా భోజనం చేద్దాం’ అని తీసుకెళ్తే కానీ ఆయన చెప్పలేదు, అప్పటికి తను భోజనం చేసి రెండు రోజులకు పైనే అయిందని. ఈ సినిమాలు అవీ మానేసి ఇంటికి వెళ్లిపోదాం! అని అనుకున్నాడట. కానీ, ఇంకోరోజు చూద్దాం అనుకుని వేచి చూస్తున్నాడట. ఇంతలో నేను భోజనానికి పిలిచాను... అది కృతజ్ఞతగా భావించి తన సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చాడు" అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.
మద్రాసులోనే తనకు కృష్ణవంశీ తెలిసినప్పటికీ అది ముఖపరిచయమేనని, నిన్నే పెళ్లాడుతా సినిమా సమయంలో ఇద్దరం బాగా కలిసిపోయామని, సింధూరం సినిమా షూటింగ్ లో ఉండగా చాలా ఆఫర్లు వచ్చాయని, కానీ, ఆ సినిమా ఫెయిల్ కావడంతో నిర్మాతలు కనబడకుండాపోయారని బ్రహ్మాజీ తెలిపారు.