నా రికార్డును మరెవరూ కొట్టలేకపోయారు!: నందమూరి బాలకృష్ణ
- దూసుకుపోతున్న 'జై సింహా'
- 50 కోట్ల క్లబ్ లో చేరినందుకు సెలబ్రేషన్స్
- తన అన్ని చిత్రాలూ రికార్డులు సృష్టించినవేనన్న బాలయ్య
- 'సమరసింహారెడ్డి' రికార్డును మరే చిత్రమూ దాటలేదని వెల్లడి
తన సినిమాలన్నీ రికార్డులు సృష్టించినవేనని, 'సమరసింహారెడ్డి' ఏకంగా 32 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుందని, ఇది ఆలిండియా రికార్డని, ఆ రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదని అన్నారు. ఏ సినిమా ఎంత వసూలు చేసిందన్న లెక్కలు తనకు గుర్తుండవని, తన అభిమానులు ఆ లెక్కలు బాగా చెబుతారని అన్నారు. 'జై సింహా' కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.