2019 ఎన్నికల్లో సినిమా వారు ప్రభావం చూపుతారు.. సేవాభావం కలవారికి మద్దతిస్తా: నటుడు నరేష్
- ఎంపీ, ఎమ్మెల్యే కావాలన్న కోరిక లేదు
- మంచి వ్యక్తులకు మద్దతిస్తా
- సినిమాలతో సంతోషంగా ఉన్నా
బీజేపీలో తాను అనేక బాధ్యతలను నిర్వర్తించానని... తనకు ఎంపీ, ఎమ్మెల్యే కావాలనే కోరిక లేదని అన్నారు. సినీ రంగంలో చాలా సంతోషంగా ఉన్నానని... సినిమాలు చేస్తూనే రాజకీయరంగంలో ఉంటానని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లో మాత్రం ఉండబోనని తెలిపారు. ప్రస్తుతం 'పవనిజం' అనే సినిమాలో తాను ఒక మంచి పాత్రను పోషిస్తున్నానని చెప్పారు.