అనంతపురం గౌరీ థియేటర్‌లో బ్రాహ్మణులకు 'జైసింహా' ప్రత్యేక ప్రదర్శన.. తరలి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు!
- 'జై సింహా'లో బ్రాహ్మణులను పొగుడుతూ బాలయ్య డైలాగులు
- బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా షో వేయించిన అనంతపురం ఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
- చిత్ర బృందంతో కలిసి సినిమా చూసిన బ్రాహ్మణులు
అంతేకాదు, జై సింహా హీరోయిన్ హరిప్రియ, రచయిత రత్నం, ఇతర చిత్ర బృందాన్ని కూడా బ్రాహ్మణులతో కలిసి ఈ సినిమా చూడడానికి అనంతపురానికి ఆహ్వానించారు. గౌరి థియేటర్‌లో ఈ సినిమా చూసిన బ్రాహ్మణ కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. అనంతరం బ్రాహ్మణులను బాలయ్య ఫ్యాన్స్ ఘనంగా సన్మానించారు.