'పద్మావత్' కోసం 'ప్యాడ్ మాన్' విడుదలను వాయిదా వేసిన అక్షయ్ కుమార్
- సంజయ్‌లీలా భన్సాలీ కోరిక మేరకు నిర్ణయం
- కృతజ్ఞతలు తెలిపిన పద్మావత్ బృందం
- ఫిబ్రవరి 9న విడుదల కానున్న 'ప్యాడ్ మ్యాన్'
అక్షయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ 'పద్మావత్' చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు నటి దీపికా పదుకునే, నటులు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు అక్షయ్ కుమార్‌కి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఒకేరోజు విడుదలైతే నిర్మాతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్న కారణంగా అక్షయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.