ఎట్టకేలకు కోర్టుకు హాజరైన యాంకర్ ప్రదీప్, మరికాసేపట్లో శిక్ష ఖరారు!
- డిసెంబర్ 31న దొరికిపోయిన ప్రదీప్
- 8న కౌన్సెలింగ్ కు హాజరైన యాంకర్
- మరికాసేపట్లో శిక్ష
డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన తరువాత, ఈ నెల 7వ తేదీ వరకూ కౌన్సెలింగ్ కు రాకుండా, పోలీసుల ఆగ్రహానికి గురైన ప్రదీప్, ఆ తరువాత కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. ఆపై షూటింగ్ ఉందని చెబుతూ కోర్టుకు రాలేదు. 22వ తేదీన కోర్టుకు హాజరవుతానని చెప్పిన ప్రదీప్, నేడు కోర్టుకు వచ్చాడు. ఇక అతనికి కోర్టు ఏ శిక్ష విధిస్తుందన్న విషయం మరికాసేపట్లో తేలనుంది. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన వేళ అతని రక్తంలో 178 పాయింట్ల ఆల్కహాల్ ఉన్నట్టు తేలింది.