శర్వానంద్ వద్దన్న కథకు నాని ఓకే చెప్పాడా?
- నాని తాజా చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం'
- ద్విపాత్రాభినయంలో నాని
- వైవిధ్యంతో క్లాస్ లుక్ - మాస్ లుక్
శర్వానంద్ కుదరదని చెప్పిన కథ .. ఆ తరువాత నాని దగ్గరికి వెళ్లిందట. నాని తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేయించేసి రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన నాని మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లాస్ లుక్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. 'హలో బ్రదర్' తరహాలో సాగే ఈ సినిమా, నాని ఖాతాలో మరో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.