దర్శక, నిర్మాతలకు నయనతార కొత్త కండిషన్లు!
- కురచ దుస్తులకు నో
- హీరోలతో సన్నిహిత సీన్లలో నటించను
- ప్రమోషన్లకు రాను
కురచ దుస్తులు ధరించనని, హీరోలతో సన్నిహితంగా ఉండే సీన్లలో నటించనని ఆమె చెబుతోంది. అంతేకాదు, ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరు కాబోనని స్పష్టం చేసింది. ఈ కండిషన్లతోనే బాలయ్య 'జై సింహా' సినిమాలో కూడా నటించిందట. సినిమాలో బాలయ్యకు దూరంగా ఉంటూనే సినిమాను పూర్తి చేసింది. అయితే, ఇన్ని కండిషన్లు పెడుతున్నప్పటికీ, నయన్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి.