గోపీచంద్ మూవీ టైటిల్ మారే ఛాన్స్ ..అదీ సెంటిమెంట్ కి కట్టుబడే!
- షూటింగ్ దశలో గోపీచంద్ 25వ మూవీ
- ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి
- కథానాయికగా మెహ్రీన్
గోపీచంద్ తన సినిమాలకు చాలావరకూ సున్నాతో పూర్తయ్యే టైటిల్స్ ను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు .. అది ఆయనకు సెంటిమెంట్. అలా ఈ సినిమాకు 'పంతం' అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందనే అభిప్రాయాలు ఎక్కువ కావడంతో, 'శపథం' అయితే ఎలా వుంటుందనే ఆలోచన చేస్తున్నారట. దాదాపు ఈ టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఈ సినిమా అయినా గోపీచంద్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.