పల్లెటూరి ప్రేమకథను పూర్తి చేసిన నిహారిక!
- నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్'
- పల్లె నేపథ్యంలో సాగే ప్రేమకథ
- భారీ సంఖ్యలో సీనియర్ ఆర్టిస్టులు
తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుందనీ .. మంచి టీమ్ తో కలిసి వర్క్ చేసినందుకు ఆనందంగా ఉందని నిహారిక చెప్పింది. ఇది పల్లెటూరి నేపథ్యంగా సాగే ప్రేమకథ .. అక్కడి కుటుంబాల మధ్య చోటుచేసుకున్న అనుబంధాల కథ. ఈ సినిమాలో సీనియర్ ఆరిస్టులు చాలామంది ఉన్నారట. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నిహారిక భావిస్తోంది.