మళ్లీ తెర మీద మేజిక్ చేయబోతున్న అనిల్ - మాధురీల జంట
- 17 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న బాలీవుడ్ జంట
- 'టోటల్ ధమాల్' హాస్య చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు
- చివరిగా 'పుకార్'లో నటించిన అనిల్ - మాధురీ
అజయ్ దేవగణ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రకుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. గత రెండు చిత్రాలకు కూడా ఈయనే దర్శకత్వం వహించారు. వీరితో పాటు ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, అర్షద్ వార్సీలు కీలకపాత్రల్లో నటించబోతున్నారు. ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.