మహేశ్ బాబు చేతుల మీదుగా 'మనసుకు నచ్చింది' ట్రైలర్ రిలీజ్
- మంజుల దర్శకత్వంలో ' మనసుకు నచ్చింది'
- యూత్ ను ఆకట్టుకుంటోన్న ట్రైలర్ కంటెంట్
- జనవరి 26వ తేదీన సినిమా విడుదల
మహేశ్ బాబు చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అల్లరి .. సందడి .. సంబరం కలగలిసిన బిట్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా .. ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ వుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. యూత్ ను ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి మరి.