చేస్తే హీరోయిన్ గా చేస్తాను .. లేదంటే లేదు అని తేల్చి చెప్పేశాను: ఆమని
- చెన్నై వాతావరణం పడలేదు
- అయినా ప్రయత్నాలు మొదలుపెట్టాను
- సిస్టర్ పాత్రలు .. ఫ్రెండ్ పాత్రలకి అడిగారు
- చేయనంటే చేయనని చెప్పాను
కొంతమంది నువ్వే హీరోయిన్ అనేవారు. మరుసటి రోజు వెళితే, 'సారీ అమ్మా హీరోయిన్ రోల్ వేరే అమ్మాయికి ఇచ్చేశాం .. సిస్టర్ రోల్ వుంది చేస్తావా?' సినిమా మొత్తం ఉంటుంది .. అని అడిగేవారు. కొంతమందేమో ఫ్రెండ్ పాత్ర చేయమని అనేవారు. చేయననే విషయాన్ని ఇంటికి వచ్చాక ఫోన్ చేసి చెప్పేదాన్ని. చేస్తే హీరోయిన్ గా చేస్తాను .. లేదంటే ఇంటికి వెళ్లిపోదాం .. చదువును కంటిన్యూ చేస్తాను' అని మా అమ్మతో కూడా తేల్చి చెప్పేశాను. డబ్బు కోసం నేను చిన్న చిన్న పాత్రలు చేయను అని స్పష్టం చేశాను' అని చెప్పుకొచ్చారు.